: కిట్టీ పార్టీల పేరుతో ధనవంతుల పిల్లలకు విందులు ఇచ్చిన కెల్విన్!
హైదరాబాద్ డ్రగ్స్ దందా కేసులో భాగంగా విచారణ జరుపుతున్న పోలీసులకు మరిన్ని విషయాలు తెలిశాయి. విద్యార్థులకు కొత్త తరహాలో కెల్విన్ డ్రగ్స్ సరఫరా చేసే వాడని, కిట్టీ పార్టీల పేరుతో ధనవంతుల పిల్లలకు విందులు ఇచ్చేవాడని ఎక్సైజ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ అధికారులు తెలిపారు. పార్టీకి వచ్చిన పిల్లలు, విద్యార్థులకు డ్రగ్స్ రుచి చూపించిన కెల్విన్, ఏడాదిగా పలు కిట్టీ పార్టీలను ఏర్పాటు చేసినట్టు తమకు తెలిసిందని అన్నారు. డ్రగ్స్ కు అలవాటైన పిల్లలతోనే అమ్మకాలు జరిపించేవాడని, సినీ పరిశ్రమలో పని చేసే వారికి మధ్యవర్తుల ద్వారా డ్రగ్స్ సరఫరా చేసేవాడని తెలిపారు. డ్రగ్స్ కు అలవాటుపడ్డ పిల్లలకు కౌన్సెలింగ్ ఇవ్వనున్నట్టు అధికారులు చెప్పారు.