: నిద్రిస్తుండగా అన్నావదినలను దారుణంగా చంపేసిన కసాయి
ఓ వ్యక్తి తన అన్న, వదినలతో పాటు వారి కుమారుడిని దారుణంగా చంపేసిన ఘటన జార్ఖండ్‌లోని దుమారియాలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనపై పోలీసులు వివరిస్తూ... ఆస్తి తగాదాల నేపథ్యంలోనే నిందితుడు ఈ దారుణానికి పాల్పడ్డాడని తెలిపారు. మొన్న రాత్రి తన అన్నావదినలు నిద్రిస్తున్న సమయంలో అతడు వారిని కత్తితో దారుణంగా పొడిచాడని, వారి పదిహేనేళ్ల కుమారుడు తప్పించుకోవడానికి ప్రయత్నించినా వదలలేదని చెప్పారు. వారి ముగ్గురి పరిస్థితిని గుర్తించిన స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే వారంతా మృతిచెందారని డాక్టర్లు నిర్ధారించారు.