: కుప్పకూలిన భారత వైమానిక దళ శిక్షణ హెలికాప్టర్.. పైలట్లు సురక్షితం
రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ బాలేసర్ ప్రాంతంలో భారత వైమానిక దళానికి చెందిన ఓ శిక్షణ హెలికాప్టర్ ఈ రోజు కుప్పకూలింది. అది ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన మైజీ-23 శిక్షణ హెలికాప్టర్ అని, అందులోని పైలట్, కో-పైలట్ సురక్షితంగా బయటపడ్డారని సంబంధిత అధికారులు తెలిపారు. ఈ ప్రమాదం ఎందుకు జరిగిందన్న విషయంపై విచారణకు ఆదేశించినట్లు చెప్పారు. ఇటీవలే కనపడకుండా పోయిన వైమానికదళ మరో హెలికాప్టర్ అరుణాచల్‌ప్రదేశ్‌లో కుప్పకూలిపోయినట్లు, ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందినట్లు అధికారులు ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఆ ఘటన జరిగిన రెండు మూడు రోజులకే మళ్లీ అటువంటి ఘటనే చోటుచేసుకోవడం గమనార్హం.