: తెలుగు సినిమా వెతికి పట్టుకున్న గొప్ప నటి నివేద: ద‌గ్గుబాటి రానా


తెలుగు సినిమా వెతికి పట్టుకున్న గొప్ప నటి నివేద అని న‌టుడు ద‌గ్గుబాటి రానా ట్వీట్ చేశాడు. నేచుర‌ల్ స్టార్ నాని న‌టించిన ‘నిన్ను కోరి’ సినిమా గురించి స్పందించిన రానా అందులో న‌టించిన నివేద థామస్ ని ఇలా పొగిడేశాడు. నిన్న సాయంత్ర‌మే నిన్నుకోరి ప్రత్యేక షో చూసిన రానా.. అద్భుతమైన నటులు కలిగిన గొప్ప సినిమా చూశానని త‌న ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నాడు. అలాంటి గొప్ప నటులున్న సమయంలోనే తాను కూడా ఇండ‌స్ట్రీలో ఉన్నందుకు గర్వంగా ఫీలవుతున్నాన‌ని ఆకాశానికెత్తేశాడు. ఈ సినిమా గురించి ఇంకా చెప్పాలంటే, దర్శకుడు మంచి సినిమా కోసం ఈ కథను ఎంచుకోలేదని, ఆ కథే ఈ యూనిట్ ను ఎంచుకుందని పేర్కొన్నాడు.    

  • Loading...

More Telugu News