: చంద్ర‌బాబును క‌లిసిన పుల్లెల గోపీచంద్‌


ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడిని బ్యాడ్మింట‌న్ కోచ్‌ పుల్లెల గోపీచంద్ క‌లిశారు. రాష్ట్రంలో క్రీడ‌ల అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని ఆయన ముఖ్య‌మంత్రిని కోరారు. ఈ విష‌యాన్ని ముఖ్య‌మంత్రి కార్యాల‌యం ట్విట్ట‌ర్ ద్వారా తెలిపింది. క్రీడ‌ల అభివృద్ధి గురించి ముఖ్యమంత్రితో చ‌ర్చించ‌డానికి గోపీచంద్ వెళ్ల‌డాన్ని ప‌లువురు నెటిజ‌న్లు ప్ర‌శంసించారు. గోపీచంద్ త‌న అకాడ‌మీ ద్వారా ఔత్సాహిక క్రీడాకారుల‌కు బ్యాడ్మింట‌న్‌లో శిక్ష‌ణ ఇస్తుంటారు. ఒలింపిక్ ప‌త‌కం గెలుచుకున్న పీవీ సింధూ కూడా ఈ అకాడ‌మీ నుంచి వ‌చ్చిన యువతే! 

  • Loading...

More Telugu News