: రీ ఎంట్రీ ఇచ్చిన యాంకర్ ఉదయభాను
తెలుగు బుల్లి తెరపై యాంకర్ ఉదయభాను చేసినంత సందడి ఎవరూ చేసి ఉండరు. అందచందాలు, అభినయం, వాక్చాతుర్యంతో టీవీ ప్రేక్షకులను కట్టిపడేసింది భాను. కవల పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత ఉదయభాను కనిపించడం మానేసింది. సుమారు మూడేళ్ల తర్వాత 'నక్షత్రం' సినిమా ఆడియో ఫంక్షన్ ద్వారా మళ్లీ రీఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాకు దర్శకుడు కృష్ణవంశీ అని తెలియడంతో, కాదనలేక యాంకరింగ్ కు ఒప్పుకుంది. ఏదేమైనప్పటికీ రీఎంట్రీతో ఉదయభాను మళ్లీ అదరగొట్టింది. తనదైన శైలిలో గలగలా మట్లాడుతూ ఆడియో ఫంక్షన్ ను రక్తి కట్టించింది.