: విస్తారా ఎయిర్‌లైన్స్ మాన్‌సూన్ ఆఫర్... రూ. 799కే విమాన ప్రయాణం
తక్కువ ఖర్చుతోనే విమానంలో ప్రయాణించే అవకాశం కల్పించే ఆఫర్‌ను `ద రిటర్న్ ఆఫ్ గ్రేట్ మాన్‌సూన్ సేల్` పేరుతో ఢిల్లీకి చెందిన విస్తారా ఎయిర్‌లైన్స్ ప్రకటించింది. ఇందులో భాగంగా ఎకానమీ తరగతి టికెట్ రూ. 799కి, ప్రీమియం ఎకానమీ తరగతి టికెట్ రూ. 2099కి అందించనున్నారు. ఈ ఆఫర్ జూలై 6, 7 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. జూలై 21 నుంచి సెప్టెంబర్ 20 మధ్య చేయబోయే ప్రయాణాలకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఇందుకు సంబంధించి ఆయా ప్రాంతాల మధ్య టికెట్ ధరల పట్టికను విస్తారా ఎయిర్‌లైన్స్ విడుదల చేసింది. వీటిలో అతి తక్కువగా (రూ.799) జమ్మూ నుంచి శ్రీనగర్ మధ్య తిరిగే విమాన ప్రయాణం ధర ఉంది. అలాగే ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు రూ. 2399, ఢిల్లీ నుంచి బెంగళూరుకు రూ. 2699, ఢిల్లీ నుంచి ముంబైకి రూ. 2099గా ధరలు నిర్ణయించారు.