: రజనీకాంత్ అందుకోసమే గ్యాంబ్లింగ్ ఆడుతున్నాడా?: సుబ్రహ్మణ్య స్వామి
ఓ వైపు సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారని ఊహాగానాలు జోరందుకుంటున్న వేళ మరోవైపు భారతీయ జనతా పార్టీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి ఆయనపై చేసే విమర్శలు కూడా అదే తీరులో ఊపందుకుంటున్నాయి. తాజాగా సుబ్రహ్మణ్య స్వామి... రజనీ ఒక 420 అంటూ ట్వీట్ చేశారు. అమెరికాలోని ఓ కాసినోలో రజనీ కాంత్ గ్యాంబ్లింగ్ ఆడుతున్న ఫొటోను కూడా స్వామి పోస్ట్ చేశారు. ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడం కోసమే రజనీకాంత్ గ్యాంబ్లింగ్ ఆడుతున్నాడా? అని ఆయన ఎద్దేవా చేశారు. అంతేకాదు, రజనీకి అసలు ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకునేందుకు ఈడీ విచారణ జరపాలని అన్నారు.