: మరో అరుదైన రికార్డుకు అడుగు దూరంలో ధోనీ
టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ మరో అరుదైన రికార్డుకు కేవలం ఒక్క అడుగు దూరంలో ఉన్నాడు. కెప్టెన్ గా, కీపర్ గా, బ్యాట్స్ మెన్ గా ధోనీకి ఇప్పటికే పలు రికార్డులు ఉన్నాయి. 2004లో అంతర్జాతీయ క్రికెట్ లోకి ధోనీ అడుగుపెట్టాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అతను ఆడిన మ్యాచ్ లలో 119 సార్లు నాటౌట్ గా నిలిచాడు. ప్రస్తుతానికి... అత్యధిక మ్యాచ్ లలో నాటౌట్ గా నిలిచిన బ్యాట్స్ మెన్ జాబితాలో శ్రీలంక మాజీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ తో కలసి అగ్రస్థానాన్ని ధోనీ పంచుకుంటున్నాడు. ఇంకొక్క మ్యాచ్ లో నాటౌట్ గా నిలిస్తే... అత్యధిక నాటౌట్ ల రికార్డును తన ఖాతాలోనే వేసుకుంటాడు. ఈ రోజు వెస్టిండీస్ తో జరగనున్న చివరి వన్డేలో... ధోనీ ఈ ఘనతను సాధిస్తాడేమో వేచి చూడాలి.
అత్యధిక సార్లు నాటౌట్ గా నిలిచిన టాప్ -5 ఆటగాళ్లు వీరే....
- ధోనీ (ఇండియా) - 119 సార్లు
- మురళీధరన్ (శ్రీలంక) - 119 సార్లు
- షాన్ పొలాక్ (సౌతాఫ్రికా) - 113 సార్లు
- చమిందా వాస్ (శ్రీలంక) - 108 సార్లు
- స్టీవ్ వా (ఆస్ట్రేలియా) - 104 సార్లు