: దుబాయ్ లో రాత్రికి రాత్రే మిలియనీర్లు అయిన ఎనిమిది మంది భారతీయులు, ఇద్దరు పాకిస్థానీలు!
అదృష్టం అంటే వీళ్లదేరా? అని అనేందుకు సరిగ్గా సరిపోతారు ఈ పది మంది. పొట్ట చేతపట్టుకుని అరబ్ దేశాలకు వెళ్లి, అక్కడ ఏళ్ల తరబడి కష్టించి పని చేస్తున్న వారిలో పది మందిని లక్ష్మీదేవి కరుణించింది. ఎనిమిది మంది భారతీయులకు, మరో ఇద్దరు పాకిస్థాన్ వాసులకు ‘బిగ్ టికెట్ రాఫెల్ డ్రా’లో ఒక్కొక్కరికీ రూ. 1,76,30,000 లాటరీ తగిలింది. షార్జాలో ఆటోమొబైల్ షాపు నడుపుకుంటున్న ఇండియన్ అల్వైన్ కుమార్, ప్రైవేటు కంపెనీలో మేనేజర్ గా ఉన్న ప్రీతారాజాయ్ ఉదయ్ కుమార్లతో పాటు ఇండియాకే చెందిన అనిల్ పుతెన్ వెట్టిల్, శరవనన్ సుందరేశన్, రిషిత్ మెహతా, పర్వేజ్ పట్గోంకర్, జయలక్ష్మి జయరాజ్, ఇబ్రహీం కుంజు నజీర్ లతో పాటు పాకిస్థాన్ కు చెందిన అదిల్ తేజ్, మహ్మద్ నాజర్ అలీ సిద్దిఖీలకు ఈ లాటరీ తగిలింది. ఇక విషయం తెలుసుకున్న వీరంతా తమ అదృష్టానికి ఉబ్బితబ్బిబ్బవుతున్నారు.