: జూనియర్ ఎన్టీఆర్ ను రాకుండా చేసింది శివాజీ రాజానే... అతనో జోకర్!: నటి తులసి ఫైర్


మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు శివాజీరాజాపై సీనియర్ నటి తులసి నిప్పులు చెరిగారు. తను తలపెట్టిన కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ ను రాకుండా చేశాడంటూ మండిపడ్డారు. వివరాల్లోకి వెళ్తే, 'శంకరాభరణం' పేరిట ఉత్తమ నటన కనబరిచిన వారికి తులసి ఈ ఏడాది నుంచి అవార్డులు ఇస్తున్నారు. ఈ ఏడాది హైదరాబాదులో ఆ వేడుకను నిర్వహించారు. ఈ వేడుకకు జూనియర్ ఎన్టీఆర్ తో పాటు పలువురు సెలబ్రిటీలను ఆహ్వానించారు. అయితే ఎవరూ కూడా ఆ ఫంక్షన్ కు హాజరుకాలేదు.

ఈ నేపథ్యంలో తులసి మాట్లాడుతూ, దీనికంతా కారణం శివాజీరాజానే అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అతను ఒక జోకర్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మా అధ్యక్షుడిగా తన అధికారాన్ని తప్పుడు దారిలో వినియోగిస్తున్నాడంటూ మండిపడ్డారు. మరొక వ్యక్తితో కలసి... తన అవార్డుల వేడుకకు గెస్ట్ లు రాకుండా అడ్డుకున్నాడని విమర్శించారు. 

  • Loading...

More Telugu News