: యశ్ రాజ్ వారి కొత్త హీరోయిన్... అన్యా సింగ్!
బాలీవుడ్ తెరకి ఎప్పటికప్పుడు కొత్త హీరోయిన్లను పరిచయం చేయడంలో యశ్‌రాజ్ ఫిలింస్ ముందుంటుంది. ఈ క్రమంలో త్వరలో తాము పరిచయం చేయనున్న హీరోయిన్ వివరాలను యశ్‌రాజ్ వారు బయటపెట్టారు. తమ తర్వాతి చిత్రంలో ఢిల్లీకి చెందిన అన్యా సింగ్ నటిస్తున్నట్లు ప్రకటించి ఆమె ఫొటోలను విడుదల చేశారు. రణబీర్‌కపూర్‌కి వరుసకి సోదరుడైన ఆదార్ జైన్‌తో కలిసి అన్యా సింగ్ తెరంగేట్రం చేయనుంది. ఈ చిత్రానికి హబీబ్ ఫైజల్ దర్శకత్వం వహించనున్నారు. గతంలో యశ్‌రాజ్ ఫిలింస్ ద్వారా బాలీవుడ్‌కి పరిచయమైన అర్జున్ కపూర్, పరిణీతి చోప్రాల `ఇషక్‌జాదే` సినిమాకి కూడా ఈయనే దర్శకత్వం వహించారు. అనుష్క శర్మ, వాణి కపూర్, భూమీ పడ్నేకర్ వంటి మంచి టాలెంట్ ఉన్న హీరోయిన్లందరూ యశ్‌రాజ్ బ్యానర్ నుంచి వచ్చినవారే.