: భారత జట్టుకు పాకిస్థాన్‌తో ఆడాలంటే ఇప్పుడు భయం పట్టుకుంది!: పీసీబీ చైర్మన్
ఛాంపియన్స్ ట్రోఫీలో విజయం తర్వాత భారత జట్టుకు పాకిస్థాన్‌తో ఆడాలంటే భయం పుడుతోందని పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ చైర్మన్ షహర్యార్ ఖాన్ ఎద్దేవా చేశారు. ట్రోఫీ గెలిచినందుకు ఆటగాళ్లను మెచ్చుకుంటూ పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో షహర్యార్ మాటలాడుతూ, `ఇప్పుడు భారత్‌ను మనతో ఆడటానికి పిలిస్తే, వాళ్లు సంకోచిస్తారు. మన ఘనవిజయం తర్వాత వారికి భయం పట్టుకుంది` అన్నారు.
ఈ సందర్భంగా ఆ జట్టు కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్‌ను టెస్ట్ కెప్టెన్‌గా ప్రకటించారు షహర్యార్. అక్టోబర్‌లో దుబాయ్‌లో శ్రీలంకతో జరగనున్న టెస్ట్ సిరీస్ కి సర్ఫరాజ్ అహ్మద్ నాయకత్వం వహించనున్నాడు. ఈ కార్యక్రమం ద్వారా ఒక్కో ఆటగాడికి రూ. కోటి చొప్పున నవాజ్ షరీఫ్ బహుమతిగా అందజేశారు. జూన్ 18న లండన్‌లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో భారత్‌పై పాక్ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే.