: బ్యూటీషియన్ శిరీష భర్తను కుకునూరుపల్లి తీసుకెళ్లిన పోలీసులు!


అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించిన బ్యూటీషియన్ శిరీష కేసులో, ఆమె బంధువుల అనుమానాలను తీర్చే ప్రయత్నం చేశారు పోలీసులు. శిరీష భర్తతో పాటు ఆమె తల్లిదండ్రులను ఈ ఉదయం కుకునూరుపల్లికి తీసుకువెళ్లిన పోలీసులు, ఎస్ఐ క్వార్టర్స్ లో సీన్ టూ సీన్ వివరించారు. శిరీష ఆత్మహత్య చేసుకున్న రాత్రి కుకునూరుపల్లికి వచ్చిన శిరీష ఏం చేసిందన్న విషయమై, తమ విచారణలో తెలిసిన అంశాలను వారికి వివరించారు. కాగా, శిరీష హత్యకు గురైందని, అంతకన్నా ముందు ఆమెను అత్యాచారం కూడా చేశారని ఆమె బంధువులు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ప్రభాకర్ రెడ్డి క్వార్టర్స్ కు శిరీష వెళ్లలేదని, హనుమాన్ ఆలయం వెనుక ఉన్న రిసార్ట్స్ కు ఆమెను బలవంతంగా తీసుకు వెళ్లారని వారు అంటున్నారు.

  • Loading...

More Telugu News