: ఫెర్రారీ ఓపెన్ కారులో దూసుకుపోతూ.. 'కబాలి' తొలి సెల్పీ వీడియో!
సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ తన తొలి సెల్ఫీ వీడియోను విడుదల చేశారు. ఆరోగ్య పరీక్షల కోసం అమెరికాలో ఉన్న రజనీ... తాను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాననే విషయాన్ని సెల్ఫీ వీడియా ద్వారా అభిమానులకు తెలియజేశారు. ఖరీదైన ఫెర్రారీ ఓపెన్ కారులో దూసుకుపోతూ రజనీ దిగిన సెల్ఫీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు, జీఎస్టీ నుంచి సినిమా థియేటర్లను మినహాయించాలని తమిళనాడులో ధర్నా జరుగుతోంది. వీరందరికీ అమెరికా నుంచే రజనీ తన మద్దతును తెలిపారు.