: ఉగ్రవాదుల్లో చేరేందుకు ఏకే-47ను దొంగతనం చేసి పారిపోయిన భారత జవాను!
కాశ్మీరులోని బారాముల్లా సెక్టార్ లో విధులు నిర్వహిస్తున్న ఓ జవాను, తన తుపాకితో సహా పారిపోయిన ఘటన కలకలం రేపుతోంది. పుల్వామా జిల్లాకు చెందిన జహూర్ అనే జవాను టెరిటోరియల్ ఆర్మీ 173వ దళంలో పని చేస్తున్నాడు. తన ఏకే-47 తుపాకిని క్యాంపు నుంచి దొంగతనం చేసి పారిపోయాడు. అతను ఉగ్రవాదుల్లో చేరేందుకు నిర్ణయించుకుని పారిపోయినట్టు అనుమానాలు వ్యక్తం చేస్తున్న సైన్యాధికారులు, జహూర్ ఉదంతాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు. జహూర్ ఎక్కడున్నాడన్న విషయంపై విచారణ జరుపుతున్నట్టు పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఈ విషయమై మరింత సమాచారం తెలియాల్సి వుంది.