: కుప్పం తొలి టీడీపీ ఎమ్మెల్యే కన్నుమూత
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఎన్.రంగస్వామినాయుడు ఈ ఉదయం కన్నుమూశారు. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో ఉన్న ఆయన, బెంగళూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. కుప్పం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికైన తొలి టీడీపీ ఎమ్మెల్యే రంగస్వామినాయుడే. 1983, 1985 సంవత్సరాల్లో జరిగిన ఎన్నికల్లో రంగస్వామి టీడీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆపై 1989లో ప్రస్తుత ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కుప్పం నుంచి పోటీ చేసి తొలిసారి గెలువగా, అప్పటి నుంచి మరో రాజకీయ పార్టీకి అక్కడ చోటు లేకుండా పోయింది. కాగా, రంగస్వామినాయుడి మృతి పట్ల చంద్రబాబుతో పాటు పలువురు టీడీపీ నేతలు సంతాపాన్ని తెలిపారు.