: రామ మందిర నిర్మాణానికి రాళ్లు తెప్పించిన వీహెచ్‌పీ
అయోధ్యలో వివాదాస్పద రామ మందిర నిర్మాణానికి పనులు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) వారు రాజస్థాన్ నుంచి మూడు ట్రక్కుల నిండా పెద్ద పెద్ద ఎరుపు రంగు రాళ్లు తెప్పించారు. వీటిని రామ్ జన్మభూమి న్యాస్లోని రామ్సేవక్పురంలో ఉంచారు. డబ్బులకు బదులుగా రాళ్లను దానం చేయమని తాము కోరితే రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌కు చెందిన రామ భక్తులు ఈ రాళ్లను పంపించారని వీహెచ్‌పీ ప్రతినిధి శరత్ శర్మ తెలిపారు.
గతేడాది కూడా కొంతమంది భక్తులు రాళ్లను పంపించారని, కాకపోతే అప్పుడు ఉన్న అఖిలేశ్ యాదవ్ ప్రభుత్వం ఆ ట్రక్కులను రాష్ట్రంలోకి వచ్చేందుకు అనుమతించలేదని ఆయన చెప్పారు. కానీ ఇప్పటి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం మాత్రం ఫారం 39 పేరుతో ఇతర రాష్ట్రాల నుంచి రాళ్లను రవాణా చేసుకునే సదుపాయం కల్పించిందని శరత్ శర్మ వివరించారు.