: వేదమంత్రోచ్చారణల మధ్య హిందూ మతంలోకి మారిన ముస్లిం లాయర్


బీహార్ లో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. మహమ్మద్ అన్వర్ (46) అనే లాయర్ హిందూ మతాన్ని స్వీకరించారు. వేదమంత్రోచ్చారణల మధ్య ఈ కార్యక్రమం కొనసాగింది. ఆయనతో పాటు ఆయన కుమారులు ఆమిర్ (11), షబ్బీర్ (9) కూడా హిందూ మతంలోకి వచ్చారు. అన్వర్ తన పేరును ఆనంద్ భారతిగా మార్చుకోగా, ఆయన కుమారులు అమన్ భారతి, సుమన్ భారతిగా పేర్లు మార్చుకున్నారు. త్వరలోనే తన భార్య కూడా హిందూ మతం స్వీకరిస్తుందని ఈ సందర్భంగా మహమ్మద్ అన్వర్ తెలిపారు.

గత 18 ఏళ్లుగా బేగుసరాయి జిల్లాలోని పొఖారియా ప్రాంతంలో అన్వర్ కుటుంబం నివసిస్తోంది. ఈ ప్రాంతంలో ముస్లిం ప్రాబల్యమే ఎక్కువ. స్థానికంగా ఉండే ఇస్లాం కాంట్రాక్టర్ సయెద్ కుటుంబం అన్వర్ ను ఏడు నెలలుగా వేధిస్తోంది. తాను నమాజ్ ఎక్కువగా చేయనని ఆరోపిస్తూ, తన ఇంటి ముందు ఎముకలు విసిరి వేధిస్తున్నారంటూ మహమ్మద్ అన్వర్ (ఆనంద్ భారతి) ఆవేదన వ్యక్తం చేశారు.

హిందూ ఆలయాలకు విరాళాలు ఎందుకిచ్చావు? బీఫ్ ఎందుకు తినవు? పిల్లలను మదర్సాలకు ఎందుకు పంపవు? అంటూ వేధింపులకు గురి చేశారని చెప్పారు. ముస్లిం నిబంధనలను పాటించకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని తనను 40 మంది ముస్లింలు హెచ్చరించారని... అందుకే తాను హిందూ మతం స్వీకరించానని ఆయన తెలిపారు. తాను మతం మారడం వెనుక ఎవరి ప్రమేయం లేదని... సొంత విచక్షణతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. ఈ సందర్భంగా బజరంగ్ దళ్ జిల్లా కన్వీనర్ శుభం భరద్వాజ్ మాట్లాడుతూ, ఆయనకు తాము రక్షణగా ఉంటామని తెలిపారు.

  • Loading...

More Telugu News