: ఇక పాక్ వంతు... ఉపరితల ఖండాంతర క్షిపణి 'నాజర్' పరీక్ష సక్సెస్


ఓ వైపు ఉత్తర కొరియా వరుస క్షిపణి పరీక్షలతో దూసుకుపోతుంటే, పాకిస్థాన్ కూడా అదే దారిలో నడుస్తోంది. ఉపరితలం నుంచి ప్రయోగించబడి, ఉపరితల లక్ష్యాలను ఛేదించగల బాలిస్టిక్ మిసైల్  'నాజర్'ను విజయవంతంగా పరీక్షించింది. ఈ క్షిపణి పరీక్ష సక్సెస్ అయిందని ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ జావేద్ బజ్వా వెల్లడించారు. ఇది అత్యాధునికమైనదని, సులువుగా ప్రయోగించవచ్చని, నిమిషాల్లో లక్ష్యాన్ని చేరుతుందని ఆయన తెలిపారు. 60 నుంచి 70 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఇది చేరుకుంటుందని తెలిపారు.

కాగా, ఈ పరీక్షను ఎక్కడి నుంచి జరిపారన్న విషయం తెలియరాలేదు. భారత్ ప్రారంభించిన 'కోర్డ్ స్టార్ట్'పై ఈ క్షిపణి విజయవంతంతో తాము నీళ్లు చల్లినట్లయిందని అన్నారు. పాక్ సైనిక శక్తిని వ్యూహాత్మకంగా పెంచుకోవాలన్న ఉద్దేశంతోనే క్షిపణి పరీక్ష చేపట్టినట్టు పేర్కొన్నారు. తమ దేశపు కమాండ్ కంట్రోల్ సిస్టమ్ అత్యంత సంతృప్తికరంగా పని చేస్తోందని, దేశ రక్షణ, భద్రతా పర్యవేక్షణను సులభతరం చేసిందని చెప్పుకొచ్చారు. కాగా 'నాజర్' విజయవంతం కావడం పట్ల పాక్ అధ్యక్షుడు మమ్నూన్ హుస్సేన్, ప్రధాని నవాజ్ షరీఫ్ తదితరులు శాస్త్రవేత్తలకు కృతజ్ఞతలు తెలిపారు.

  • Loading...

More Telugu News