: మీరిలా ఉన్నారు కాబట్టే మీ క్రికెట్ ఇలా ఏడుస్తోంది!: ధోనీపై రమీజ్ రాజా కామెంట్ కు గడుసు స్పందన


భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి గ్రేడ్ ఏ కాంట్రాక్టు ఇవ్వడం ఏంటని పాక్ మాజీ క్రికెటర్ రమీజ్ రాజా చేసిన విమర్శలపై భారత క్రీడాభిమానులు తీవ్రంగా స్పందిస్తున్నారు. టెస్టు క్రికెట్ నుంచి రిటైర్ అయిన ఆటగాళ్లకు బీసీసీఐ గ్రేడ్ ఏ కింద అధిక వేతనాలు చెల్లించడాన్ని ఆయన విమర్శించాడు. ఇక రమీజ్ విమర్శలపై స్పందిస్తూ, "ముందు పాకిస్థాన్ క్రికెట్ గురించి పట్టించుకోండి. పాక్ క్రికెట్ టీమ్ ఎందుకు వెనుకబడిందో ఇప్పుడు నాకు తెలిసింది. సీనియర్లు ఇతర దేశాల క్రికెటర్ల గురించి ఆలోచిస్తున్నారు కాబట్టే" అని ఓ అభిమాని వ్యాఖ్యానించాడు.

"ముందు పీసీబీ గురించి ఆలోచించండి. ఆ తరువాత మా బీసీసీఐని ప్రశ్నిద్దురు గాని. అసలు నువ్వు కామెంటేటరువేనా?" అని ఒకరు, "ధోనీకి ఏ గ్రేడ్ కాంట్రాక్టు ఇస్తే, నీకెందుకు బాధ... మీలాంటి వారి వైఖరి వల్లే పాక్ క్రికెట్ ఇలా ఏడుస్తోంది" అని మరొకరు వ్యాఖ్యానించారు. పబ్లిసిటీ కోసమే రమీజ్ రాజా ఇలా చౌకబారు విమర్శలు చేస్తున్నారని, మరోసారి ఇండియా వస్తే, అభిమానుల నుంచి నిరసనలు ఎదుర్కోక తప్పదని, 2060 వరకూ పాక్ క్రికెట్ జట్టు ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ విజయోత్సవాలు జరుపుకుంటూనే ఉండి పోతుందని, అసలు బీసీసీఐ గురించి ప్రశ్నించే హక్కు నీకు ఎక్కడిదని... ఇలా పలు రకాల కామెంట్లు వస్తున్నాయి.

  • Loading...

More Telugu News