: తెరకెక్కనున్న దర్శకరత్న దాసరి జీవిత చరిత్ర.. దర్శకత్వం వహించనున్న ప్రముఖ డైరెక్టర్


తెలుగు సినీ రంగంపై తనదైన ముద్ర వేసిన దర్శకరత్న దాసరి నారాయణరావు ఇటీవలే తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఆయన మరణంతో సినీ పరిశ్రమ ఓ పెద్ద దిక్కును కోల్పోయింది. ఇప్పుడు ఆయన జీవిత చరిత్రను తెరకెక్కించే ప్రయత్నం జరుగుతోంది. ఈ మేరకు ఫిలిం ఫెడరేషన్ మాజీ అధ్యక్షుడు, నటుడు ఓ.కల్యాణ్ ఒక ప్రకటన చేశారు. దాసరి వద్ద శిష్యరికం చేసిన ఓ ప్రముఖ దర్శకుడు ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నట్టు తెలుస్తోంది.

ఈ సినిమా ద్వారా తమ గురువుగారికి ఘన నివాళి అర్పిస్తామని కల్యాణ్ తెలిపారు. ఈ చిత్రంలో ఆయన రాజకీయ జీవితాన్ని కూడా ప్రస్తావించనున్నారు. ఆయన ఎదుర్కొన్న ఇబ్బందులు, సాధించిన ఘన విజయాలు అన్నీ ఈ సినిమాలో ఉండబోతున్నాయి. ఈ సినిమాలో నటించబోయే నటీనటుల వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.

  • Loading...

More Telugu News