: సరిహద్దుల్లో భారత సైన్యానికి 'బలం' చూపుతున్న చైనా!
భారత్, చైనా సరిహద్దుల్లోని డోక్లాం ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న వేళ, భారత సైన్యానికి తన బలం చూపాలన్న ఉద్దేశంతో అదే ప్రాంతంలో యుద్ధ విన్యాసాలు ప్రారంభించింది చైనా. స్వదేశీ యుద్ధ విమానాలు, ట్యాంకర్లు, తేలికపాటి క్షిపణులను ప్రయోగించే మొబైల్ వ్యాన్లతో పాటు అత్యాధునిక రాడార్లను సరిహద్దులకు ఇప్పటికే తరలించిన చైనా, వాటితో విన్యాసాలు జరుపుతూ ఇండియాను రెచ్చ గొడుతోంది. ఓ వైపు తాము చర్చలకు సిద్ధమని, చర్చల ద్వారా సరిహద్దు సమస్యను పరిష్కరించుకుందామని చెబుతూనే, మరోవైపు నుంచి తన సైనిక శక్తిని ప్రదర్శిస్తోంది. కాగా, తక్షణం భారత సైనిక దళాలు తమకు చెందిన డోక్లాం ప్రాంతం నుంచి వైదొలగకుంటే, తన్ని తరిమేస్తామని నిన్న చైనా హెచ్చరించిన సంగతి తెలిసిందే.