: తమిళనాడులో ఉప్పొంగిన సముద్రం.. 8 గ్రామాల్లోకి ప్రవేశించిన సముద్రపు నీరు!


తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలో సముద్రం ఉప్పొంగుతోంది. సముద్రం ముందుకు చొచ్చుకొస్తోంది. విరుచుకుపడుతున్న అలల ధాటికి రక్షణ గోడలు సైతం దెబ్బతిన్నాయి.  ఈ నేపథ్యంలో, జిల్లాలోని 8 గ్రామాల్లోకి సముద్రపు నీరు ప్రవేశించింది. తేంగాయపట్టణం, ముళ్లూర్ హార్బర్ ప్రాంతాల పరిధిలో ఈ గ్రామాలు ఉన్నాయి. ఎగసిపడుతున్న అలల ధాటికి జాలర్ల గ్రామాల్లోని ఇళ్లలోకి సైతం నీరు ప్రవేశించింది. జూన్, జూలై నెలల్లో కన్యాకుమారి జిల్లాలో సముద్రం ఉప్పొంగడం సాధారణ అంశమే అయినప్పటికీ... ఈ ఏడాది మాత్రం అలల తీవ్రత మరింత ఉద్ధృతంగా ఉందని ఆయా గ్రామాల ప్రజలు చెబుతున్నారు. మరోవైపు, సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో, జాలర్లు చేపల వేటకు కూడా వెళ్లలేదు.

  • Loading...

More Telugu News