: వెనిజులాలో తీవ్ర సంక్షోభం... పార్లమెంటులో ప్రవేశించి ఎంపీలను కర్రలు, రాడ్లతో చితక్కొట్టిన వైనం... వీడియో ఇదిగో!


వెనిజులాలో సంక్షోభం తీవ్ర స్థాయికి చేరింది. వెనిజులా స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని పార్లమెంటులో ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ నికోలస్ ముదురో మద్దతుదారులు పార్లమెంటు పరిసరాల్లోకి చొచ్చుకొచ్చారు. వారిని సెక్యూరిటీ సిబ్బంది ఆపలేకపోయారు. దీంతో సుమారు వందమంది ఆందోళనకారులు పార్ల‌మెంట్ హాల్‌ లోకి ప్రవేశించారు. అక్కడ సమావేశంలో పాల్గొన్న ప్రతిపక్ష ఎంపీలపై విరుచుకుపడ్డారు. కర్రలు, రాడ్లు, షూస్ తో దాడులు చేశారు. దీంతో ఎంపీలు తీవ్రంగా గాయపడ్డారు. వారిని పలువురు అధికార పార్టీ ఎంపీలు నిలువరించడానికి ప్రయత్నించినా, ఫలితం లేకపోయింది. తీవ్రమైన గాయాలతో ప్రతిపక్ష ఎంపీలు పరుగులు తీశారు. ఆ వీడియో మీరు కూడా చూడండి. 

  • Loading...

More Telugu News