: తమిళనాడు 'టెట్‌'లో 95 శాతం మంది విద్యార్థులు ఫెయిల్.. నోరెళ్లబెట్టిన విద్యాశాఖ!


ఇటీవల తమిళనాడు ప్రభుత్వం నిర్వహించిన టీచర్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ (‌టీఈటీ) ఫలితాలను తాజాగా విడుదల చేసిన విద్యాశాఖ షాక్‌కు గురైంది. పరీక్షకు హాజరైన అభ్యర్థుల్లో 95 శాతం మంది ఫెయిలవడాన్ని చూసి అధికారులు నోరెళ్లబెట్టారు. మొత్తం 7.53 లక్షల మంది టెట్‌కు హాజరు కాగా కేవలం 39,979 మంది మాత్రమే పాసయ్యారు.

తమిళనాడు ప్రభుత్వం నాలుగేళ్ల తర్వాత ఈ ఏడాది ఏప్రిల్ 29, 30 తేదీల్లో టెట్ నిర్వహించింది. పేపర్-1కు 2.41 లక్షల మంది విద్యార్థులు హాజరు కాగా, పేపర్-2కు 5.12 లక్షల మంది హాజరయ్యారు. ప్రాథమిక స్థాయి తరగతులు (1-5), మాధ్యమిక స్థాయి తరగతుల (6-8) కోసం ఉపాధ్యాయులను భర్తీ చేసేందుకు తమిళనాడు టీచర్స్ రిక్రూట్‌మెంట్ బోర్డు టెట్ నిర్వహించింది. జూలై 1న విడుదల చేసిన ఫలితాల్లో ఏకంగా ఏకంగా 4.93 లక్షల మంది గ్రాడ్యుయేట్లు పేపర్-2లో కనీస మార్కులు సాధించడంలో విఫలమయ్యారు.  పేపర్-1లో 2.25 లక్షల మంది ఫెయిలవడాన్ని చూసి అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News