: కోచ్ ఎంపిక కోసం కోహ్లీతో భేటీకి బీసీసీఐ సీఈవో


టీమిండియా చీఫ్ కోచ్ ఎంపికకు సమయం దగ్గరపడుతోంది. ఈ నేపథ్యంలో బీసీసీఐలో వేగం పెరిగింది. నిర్ణీత సమయానికి టీమిండియాకు చీఫ్ కోచ్ ఎంపిక, ప్రకటన పూర్తి చేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో జట్టుకు ఎలాంటి కోచ్ అయితే బాగుంటుందో తెలుసుకునేందుకు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో బీసీసీఐ సీఈవో రాహుల్ జోహ్రీ భేటీ కానున్నారు. ఈమేరకు ఆయన జమైకా వెళ్లడానికి సీవోఏ అనుమతి తీసుకున్నారు. కరీబియన్ దీవుల్లో పర్యటనలో ఉన్న కోహ్లీతో భేటీ అయిన అనంతరం టీమిండియా కొత్త కొచ్ ఎంపిక ఘట్టం ప్రారంభం కానుంది. జూలై 9వ తేదీ నాటికి కోచ్ ను ప్రకటిస్తామని గతంలో బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కోహ్లీతో రాహుల్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. 

  • Loading...

More Telugu News