: సల్మాన్ కు ఖరీదైన కారును బహూకరించిన షారూఖ్!
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్, కండల వీరుడు సల్మాన్ ఖాన్ కు ఖరీదైన కారును బహుమతిగా ఇచ్చాడని బాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. తాజాగా సల్మాన్ నటించిన ‘ట్యూబ్ లైట్’ సినిమా విడుదలై బాక్సాఫీసు వద్ద విఫలమైన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో షారూఖ్ మెజీషియన్ గా ఒక అతిథి పాత్రలో కనువిందు చేశాడు. ఇద్దరు స్టార్లు కనిపించినా ఈ సినిమా కలెక్షన్ల సాధనలో వెనుకబడి, డిజాస్టర్ గా నిలిచింది.
కాగా, ఆనంద్ ఎల్.రాయ్ దర్శకత్వంలో షారూఖ్ నటిస్తున్న తాజా చిత్రంలో సల్మాన్ కూడా అతిథి పాత్ర చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆ సినిమా సెట్ కు వెళ్లిన సల్మాన్ కు అక్కడ షారూఖ్ ఖరీదైన ఓ కారును బహుమతిగా అందజేశాడని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.