: 2019 నుంచి పెట్రోల్, డీజిల్ కార్ల తయారీ బంద్: ప్రకటించిన వోల్వో


పెట్రోల్, డీజిల్ కార్లను 2019 నుంచి తయారు చేయకూడదని స్వీడన్ కు చెందిన ప్రముఖ వాహన తయారీ సంస్థ ‘వోల్వో’ సంచలన నిర్ణయం తీసుకుంది. 2019 నుంచి కేవలం ఎలక్ట్రిక్, హైబ్రిడ్‌ కార్లను మాత్రమే తయారు చేయాలని ఈ సంస్థ భావిస్తోంది. ఈ మేరకు వోల్వో సీఈవో హకాన్ శామ్యూల్ సన్ మాట్లాడుతూ, కస్టమర్ల నుంచి ఎలక్ట్రిక్ కార్లకు అధిక డిమాండ్ వస్తోందని చెప్పారు. వినియోగదారుల అవసరాలను అర్థం చేసుకుని స్పందించాల్సిన భాధ్యత తమపై ఉందని ఆయన తెలిపారు.

అంతే కాకుండా ఎలక్ట్రిక్ కార్లకు మారడం వల్ల కంపెనీ బ్రాండ్ కూడా మరింత బలపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇలాంటి సంచలన నిర్ణయం తీసుకున్న తొలి కంపెనీగా వోల్వో చరిత్రలో నిలిచిందని ఆయన పేర్కొన్నారు. ఇది చాలా కీలకమైన అంశమని ఆయన తెలిపారు. అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీతో ఒకసారి చార్జ్‌ చేస్తే 500 కిలోమీటర్లు ప్రయాణించే కార్లను రూపొందిస్తున్నామని ఆయన తెలిపారు. నాణ్యమైన, నమ్మకమైన బ్యాటరీలు సరఫరా చేసే వారి అవసరం చాలా ఉందని, అలాంటి వారికోసం అన్వేషిస్తున్నామని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News