: ఎట్టకేలకు దిగొచ్చిన జమ్ముకశ్మీర్.. ఒకే దేశం, ఒకే పన్నుల విధానానికి అసెంబ్లీ ఓకే!


వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)పై ఇన్నాళ్లు బెట్టు చేసిన జమ్ముకశ్మీర్ ఎట్టకేలకు ఆ బిల్లును ఆమోదించింది. జీఎస్టీ అమలు కోసం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని బుధవారం అసెంబ్లీ ఆమోదించింది. ఆర్థిక మంత్రి హసీబ్ డ్రబు జీఎస్టీపై తీర్మానాన్ని ప్రవేశపెట్టగా ప్రతిపక్షాల నిరసన మధ్యే వాయిస్ ఓటు ద్వారా దానికి ఆమోద ముద్ర పడింది. మరోవైపు శాసనమండలి కూడా ఈ తీర్మానానికి వాయిస్ ఓటు ద్వారా ఆమోదం తెలిపింది.

ఈ సందర్భంగా మంత్రి హసీబ్ డ్రబు మాట్లాడుతూ జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక హోదాను కాపాడడానికి, సొంతంగా పన్నులు విధించడానికి రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. జీఎస్టీపై ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తుండడాన్ని మంత్రి ప్రస్తావిస్తూ  సెక్షన్ 5 (జమ్ముకశ్మీర్ కాన్‌స్టిట్యూషన్), రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 అలాగే ఉంటాయని, వాటిని మార్చలేదని స్పష్టం చేశారు. రాజ్యాంగంలోని సెక్షన్ 5 రాష్ట్రానికి పన్నులు విధించే అధికారాన్ని కల్పిస్తుంది.

  • Loading...

More Telugu News