: ఐఏఎఫ్ విమానంలో దాక్కున్న భారీ కొండచిలువ.. ఐదు గంటలు కష్టపడి పట్టుకున్న రెస్క్యూ సిబ్బంది!
భారత వాయుసేనకు చెందిన రవాణా విమానం ఏఎన్-32లో 8 అడుగుల భారీ కొండచిలువ ఒకటి నక్కింది. ఆగ్రా ఎయిర్ బేస్‌లో ఉన్న ఈ విమానంలోని అండర్ క్యారేజ్ బేలోకి అది చొరబడింది. దీనిని గుర్తించిన అధికారులు రెస్క్యూ టీంకు సమాచారం ఇవ్వగా వారొచ్చి దానిని పట్టుకుని బయటకు తీశారు. కొండచిలువను బయటకు తీసేందుకు వారికి ఐదు గంటల సమయం పట్టింది. ప్రస్తుతం దీనిని మెడికల్ అబ్జర్వేషన్‌లో పెట్టిన రెస్క్యూ సిబ్బంది అది ఫిట్‌గా ఉందని భావించాక అడవిలో వదిలేస్తామని చెప్పారు. విమానం కుడివైపు రెక్కలోని అండర్ క్యారేజ్‌లో అది కనిపించిన వెంటనే అటవీ అధికారులకు సమాచారమిచ్చినట్టు ఐఏఎఫ్ అధికారులు తెలిపారు.