: బూతులు తిట్టుకుని.. కుర్చీలతో కొట్టుకున్న టీఆర్ఎస్, ఎంఐఎం నాయకులు!


టీఆర్ఎస్, ఎంఐఎంకు చెందిన ఇద్దరు నాయకులు పరస్పరం బూతులు తిట్టుకుని, కుర్చీలతో కొట్టుకున్న సంఘటన సంగారెడ్డిలో జరిగింది. ఇటీవల జరిగిన రంజాన్ పండగ ఏర్పాట్లను తామంటే తాము చేశామంటూ రెండు పార్టీల నాయకులు సామాజిక మాధ్యమాల వేదికగా ఫొటోలు పెట్టడమే ఈ వివాదానికి దారితీసింది. ఈ ఫొటోలను ఎంఐఎం కౌన్సిలర్ హారీఫ్, టీఆర్ఎస్ నాయకుడు షమీలు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. షమీ భార్య టీఆర్ఎస్ కౌన్సిలర్ గా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు జరిగిన మున్సిపల్ సమావేశానికి తన భార్యను దింపేందుకు షమీ అక్కడికి వెళ్లారు. ఈ క్రమంలో హారీఫ్, షమీ మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారి తీసింది. ఇతర కౌన్సిలర్లు వారికి సర్దిచెప్పడంతో ఆ వివాదం సద్దుమణిగింది.

  • Loading...

More Telugu News