: మమతా బెనర్జీకి షాక్ ఇచ్చిన ఆరుగురు ఎమ్మెల్యేలు!
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి రాష్ట్రపతి ఎన్నికలు చిక్కులు తెచ్చిపెట్టాయి. మమతా బెనర్జీ యూపీఏ నిలబెట్టిన మీరాకుమార్‌కి మద్దతు పలుకుతుండడంతో త్రిపుర రాష్ట్రానికి చెందిన ఆరుగురు తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమయ్యారు. సీపీఎం మద్దతు తెలిపిన మీరాకుమార్‌కు ఓటేయడానికి వారు నిరాకరిస్తున్నారు. త్వరలోనే వారు బీజేపీలో చేరనున్నట్లు సమాచారం. రేపు ఆ ఆరుగురు అసోంలోని గౌహతిలో జరిగే ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్ సభలో పాల్గొననున్నారు. వీరంతా గతేడాది కాంగ్రెస్ నుంచి వచ్చి టీఎంసీలో చేరారు. ఇప్పుడు బీజేపీలోకి వెళ్లడానికి సిద్ధమవుతున్నారు.