: ప్రేమించుకుని పారిపోయి పెళ్లి చేసుకున్న అక్కాచెల్లెళ్లు!
వరుసకు అక్కాచెల్లెళ్లు అయిన ఇద్దరు యువతులు ప్రేమించి పెళ్లి చేసుకున్న విచిత్ర సంఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. తాము ‘లెస్బియన్’ (స్వలింగ సంపర్కం కలిగి వుండే స్త్రీ)ల మంటూ ఇప్పుడు వేరు కాపురం పెట్టారు. పూర్తి వివరాల్లోకి వెళితే, ఆ నగరంలోని విజయనగర్‌లో రెండు కుటుంబాలు పక్కపక్క ఇళ్లలో నివసించేవి. బంధువులైన వారిద్దరి ఇళ్లలో ఇద్దరు ఆడపిల్లలు ఉండేవారు. వరుసకు వారు అక్క, చెల్లెలు అవుతారు. ఆ ఇద్దరు అమ్మాయిలు చిన్నప్పటి నుంచి కలిసిమెలసి స్కూలుకి, కాలేజీని వెళ్లేవారు.
ప్రస్తుతం వారిలో ఒకరు ప్రైవేటు కళాశాలలో బీ.కాం చదువుతుండగా, మరొక అమ్మాయి కాల్‌సెంటర్‌లో ఉద్యోగం చేస్తోంది. కొన్ని రోజుల నుంచి బీకాం విద్యార్థిని అబ్బాయిలాగ ప్రవర్తిస్తోంది. కాల్‌సెంటర్ లో పనిచేస్తోన్న తనకు సోదరి అయిన అమ్మాయిని ప్రేమిస్తున్నట్లు చెప్పింది. తొలుత ఆ కాల్‌సెంటర్ ఉద్యోగిని తన సోదరి ప్రవర్తనను చూసి ఊరికే అంటోందని అనుకుంది. చివరికి ఆమె ప్రేమను అంగీకరించింది. ఇద్దరూ ప్రేమపక్షుల్లా అన్ని చోట్లా తిరిగేవారు. ఇద్దరూ అమ్మాయిలే కావడంతో తమ ఇళ్లల్లో తమ పెళ్లికి అంగీకరించబోరని గత నెలలో ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు.
నగరంలోని కోరమంగళలో వారు కాపురం పెట్టి సహజీవనం చేస్తున్నారు. వారిలో బీకాం విద్యార్థిని తల్లిదండ్రులు తమ కుమార్తె కనిపించడం లేదని పోలీసులను ఆశ్రయించడంతో పోలీసులు దర్యాప్తు చేసి అసలు విషయాన్ని కనిపెట్టారు. వారిద్దరూ మేజర్లు కాబట్టి తామేం చేయలేమని ఆ అమ్మాయిల తల్లిదండ్రులకు చెప్పారు. వారికి మానసిక నిపుణులు కౌన్సెలింగ్ ఇచ్చే పనిలో పడ్డారు.