: డ్రగ్స్ వంటి వాటిని ఉక్కుపాదంతో అణచివేస్తాం: చంద్రబాబు నాయుడు
డ్రగ్స్ వంటి వాటిని తమ ప్రభుత్వం ఉక్కుపాదంతో అణిచివేస్తుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ రోజు అనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... మంచి విలువలపై సమాజంలో చర్చలు జరిగేలా కూడా తాము చర్యలు తీసుకుంటామని చెప్పారు. డ్రగ్స్ వంటి వాటి జోలికి పోకుండా యువత అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. చెడు అలవాట్లకు గురిచేసే ఇటువంటి చర్యల పట్ల తమ ప్రభుత్వం కఠినంగా ఉంటుందని చెప్పారు. చెడు అలవాట్ల పట్ల యువత ఆకర్షితులు కాకూడదని సూచించారు.