: నన్ను చూసేందుకు ఇంతమంది అభిమానులు వస్తారని అసలు ఊహించలేదు: ‘సరైనోడు’ హీరోయిన్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన 'సరైనోడు' చిత్రంలో యంగ్ ఎమ్మెల్యేగా నటించిన క్యాథరిన్ ఈ రోజు ప్రకాశం జిల్లా ఒంగోలులోని అద్దంకి బస్టాండ్ వద్ద సందడి చేసింది. అక్కడ జరిగిన ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ఆ అమ్మడుని చూసేందుకు అభిమానులు పోటెత్తారు. దీంతో తనకు ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారా? అంటూ క్యాథరీన్ ఆశ్చర్యపోయింది. ఓ షోరూం ఓపెనింగ్‌కు రావడం ఇదే మొదటిసారని ఆమె పేర్కొంది. తనకోసం ఇంతమంది అభిమానులు వస్తారని అసలు ఊహించలేదని తెలిపింది. తన అభిమానులకు సెల్ఫీలకు పోజులిచ్చింది.