: విలువలు దిగజార్చేలా ఆంధ్రజ్యోతి వార్తలు రాసింది: ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మండిపాటు
గిరిజనుల మనోభావాలు దెబ్బతినేలా ఆంధ్రజ్యోతి పత్రిక తప్పుడు వార్తలు రాసిందంటూ వైసీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మండిపడ్డారు. ఈ రోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ, ‘ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్ కు తమ పార్టీ నాయకులను, నేతలను జగన్ పరిచయం చేయించి, ఫొటోలు తీయించారు. కానీ, విలువలు దిగజార్చేలా ఆంధ్రజ్యోతి వార్తలు రాసింది. మీ రాతలు వెనక్కి తీసుకోకుంటే న్యాయపోరాటం చేస్తాం. అవాస్తవ వార్తలు రాసి గిరిజనులను, దళితులను కించపర్చొద్దు’ అని ఆమె మండిపడ్డారు. కాగా, ఎన్నికల ప్రచార నిమిత్తం ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్ నిన్న తెలుగు రాష్ట్రాల్లో పర్యటించిన విషయం తెలిసిందే. హైదరాబాద్ లోని ఓ హోటల్ లో వైసీపీ అధినేత జగన్ ని ఆయన కలిశారు.