: ఏటీఎంల నుంచి రూ.200 నోట్లను పొందలేం!


భారతీయ రిజర్వు బ్యాంకు త్వరలో రూ.200 నోటును విడుదల చేయనుంద‌ని వార్త‌లు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. ఈ నోటును ఈ ఏడాది చివరికల్లా అందుబాటులోకి తీసుకురావాల‌ని ఆర్‌బీఐ భావిస్తోంది. ప్ర‌స్తుతం దేశంలో చలామణిలో చిన్న నోట్ల సరఫరా తక్కువగా ఉండటంతోనే ఆర్‌బీఐ ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. ఈ నోట్ల ముద్ర‌ణ ఇప్ప‌టికే ప్రారంభ‌మ‌యింద‌ని స‌మాచారం. కాగా, ఈ రూ.200 నోటును ఏటీఎమ్‌ల‌ నుంచి పొందలేము. రూ.200 నోటును బ్యాంకు శాఖల ద్వారా మాత్రమే ఖాతాదారులు అందుకుంటారు. ఈ రూ.200 నోటును విడుద‌ల చేయ‌డం ద్వారా చిన్న‌ నోట్ల సరఫరా-డిమాండ్‌ మధ్య అంతరం తగ్గుతుందని ఆర్‌బీఐ భావిస్తోంది.

  • Loading...

More Telugu News