: రోజా వ్యాఖ్యల్లో నస తప్ప, పస ఉండదు: మంత్రి ఆదినారాయణరెడ్డి


వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా చేసే వ్యాఖ్యల్లో నస తప్ప, పస ఉండదని ఏపీ మంత్రి ఆదినారాయణరెడ్డి సెటైర్ వేశారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, రోజూ టీవీలో కనిపించాలనే ఉద్దేశ్యంతో రోజా తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని, ఆమె చాలా విషయాలు తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. నంద్యాల ఉపఎన్నికలో టీడీపీ విజయం ఖాయమని ఈ సందర్భంగా ఆయన ధీమా వ్యక్తం చేశారు. హెరిటేజ్ వ్యాన్ లో ఎర్రచందనం తరలిస్తున్నారంటూ వైఎస్సార్సీపీ నేతల ఆరోపణల్లో ఎటువంటి వాస్తవం లేదని అన్నారు. ఒకవేళ, హెరిటేజ్ వ్యాన్ లో ఎర్రచందనం తరలిస్తే కనుక, పోలీసులతో మేనేజ్ చేయలేమా? అని ఆయన ప్రశ్నించారు. ఎర్రచందనం దుంగలు తరలిస్తున్న వ్యాన్ ‘హెరిటేజ్’ది కాదని పోలీసులు తేల్చిన విషయాన్ని ఈ సందర్భంగా ఆదినారాయణరెడ్డి ప్రస్తావించారు.

  • Loading...

More Telugu News