: మీడియాపై సినీనటుడు రవితేజ అనుచరుల చిందులు!


ప్రముఖ సినీ నటుడు రవితేజ సోదరుడు భరత్ సంస్మరణ కార్యక్రమం హైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్ కల్చరల్ క్లబ్ లో ఈరోజు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి హాజరైన రవితేజ తన సోదరుడికి నివాళులర్పించాడు. అనంతరం, మీడియాతో మాట్లాడాడు. భరత్ ను రవితేజ కడసారి చూడలేకపోవడంపై వచ్చిన వార్తలను ఆయన ఈ సందర్భంగా ఖండించారు.

భరత్ అంత్యక్రియల మర్నాడే షూటింగ్ కు వెళ్లిన రవితేజ, తోటి ఆర్టిస్టులతో సెల్పీ దిగిన విషయాన్ని మీడియా ప్రశ్నించగా, సెల్ఫీ దిగిన మాట నిజమేనని ఒప్పుకున్నాడు. అయితే, ఇదే సమయంలో మీడియాకు చెందిన వ్యక్తులు గుచ్చిగుచ్చి అడిగిన పలు ప్రశ్నలపై ఆయన అసహనం వ్యక్తం చేేశాడు. మీడియా సమావేశాన్ని అర్థాంతరంగా ముగించిన రవితేజ, ‘థ్యాంక్స్’ చెబుతూ అక్కడి నుంచి వెళ్లిపోయి తన కారు ఎక్కాడు. అనంతరం తనపై ప్రశ్నలు గుప్పించిన సదరు విలేకరి వివరాలపై ఆరా తీయమని తన అనుచరులకు రవితేజ చెప్పినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా, ఇష్టానుసారం ప్రశ్నలు అడిగితే ఊరుకోమని రవితేజ అనుచరులు పాత్రికేయులను బెదిరించినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News