: గుర్తుపట్టడానికి వీలులేకుండా చేసి, త‌న ఫొటోను పోస్ట్ చేసిన టీమిండియా క్రికెట‌ర్!


ఇక్కడి ఫొటోలో ఉన్న‌ది ఎవ‌రో చెప్ప‌గ‌ల‌రా? ఇటీవ‌ల టీమిండియా సాధించిన‌ విజ‌యాల్లో కీల‌క పాత్ర‌పోషించిన బ్యాట్స్‌మెన్‌. మైదానంలో ఓపెన‌ర్‌గా అడుగుపెట్టి 'శ‌త‌'క్కొట్టేస్తోన్న శిఖర్‌ ధావన్‌. సోష‌ల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే ధావ‌న్ తాజాగా ఈ పొటోను పోస్ట్ చేసి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. త‌న‌ను ఎవ్వ‌రూ గుర్తు పట్టనంత‌గా ఇలా మార్పులు చేశాడు. ఈ ఫొటోలో ధావ‌న్‌ కూర్చుని నిద్రపోతున్నాడు. త‌న ముఖం పెద్ద‌గా అయిపోయిన‌ట్లు కార్టూన్ పాత్ర‌లా చేసేశాడు. 'శుభ‌రాత్రి. ఇప్పుడు ఇక్కడ రాత్రి సమయం... హాయిగా నిద్రపోండంటూ' ఈ పోస్టులో పేర్కొన్నాడు.

  • Loading...

More Telugu News