: తాత ముత్తాతల నుంచి పరిచయాలున్నట్టు సీన్ క్రియేట్ చేశారు: కేసీఆర్ పై వీహెచ్ ఫైర్
జీఎస్టీ వల్ల రాష్ట్రానికి లాభం అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఓవైపు చెబుతుంటే... నష్టం కలుగుతుందంటూ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ చెబుతున్నారని... వీరిద్దరిలో ఎవరు అబద్దాలు చెబుతున్నారో తేల్చాలని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు అన్నారు. బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థి కోవింద్ హైదరాబాదుకు వస్తే... కేసీఆర్ హల్ చల్ చేశారని విమర్శించారు. తాత ముత్తాతల నుంచి పరిచయాలు ఉన్నట్టు సీన్ క్రియేట్ చేశారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినప్పుడు యూపీఏ రాష్ట్రపతి అభ్యర్థి మీరాకుమార్ లోక్ సభ స్పీకర్ గా ఉన్నారని... అలాంటి వ్యక్తికి రాష్ట్రపతి ఎన్నికల్లో టీఆర్ఎస్ మద్దతు ఇవ్వకపోవడం దారుణమని అన్నారు. మీరాకుమార్ ఫోన్ చేసినా స్పందించని కేసీఆర్ ఏం ముఖ్యమంత్రి? అని మండిపడ్డారు. కేసీఆర్ అరాచక పాలన వల్ల రాష్ట్రంలో మావోయిస్టులు పెరుగుతున్నారని అన్నారు.