: పీవీ సింధుకి హ్యాపీ బర్త్ డే చెప్పిన మంచు లక్ష్మి
అద్భుత విజయాలు నమోదు చేసుకుంటూ దూసుకుపోతున్న భారత బ్యాడ్మింటన్ స్టార్ క్రీడాకారిణి, హైదరాబాదీ పీవీ సింధు ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటోంది. రియో ఒలింపిక్స్‌లో పతకం సాధించిన ఈ తెలుగు తేజానికి ప్రముఖులు, అభిమానులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. పీవీ సింధు ఆడే ప్రతి మ్యాచ్‌లోనూ విజయం సాధించి, చరిత్ర సృష్టించాలని, దేశం సగర్వంగా తలెత్తుకునేలా చేయాలని సినీ నటి మంచు లక్ష్మి తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొంటూ ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది.