: తిరుపతిలో రోజా దిష్టి బొమ్మ దహనం... కాళ్లతో తన్ని, నిప్పంటించిన టీడీపీ మహిళలు


తిరుపతిలో వైసీపీ ఎమ్మెల్యే రోజా దిష్టిబొమ్మను తెలుగుదేశం పార్టీకి చెందిన మహిళలు దహనం చేశారు. దిష్టి బొమ్మను దగ్ధం చేయడానికి ముందు దాన్ని కాళ్లతో తన్నారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా టీడీపీ అధ్యక్షురాలు పుష్పావతి మాట్లాడుతూ, మహిళలపై గౌరవం కూడా లేకుండా రోజా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రజా ప్రతినిధిగా ఉన్నతమైన హోదాలో ఉన్నప్పటికీ, రోజా ఆమె స్థాయికి తగ్గట్టు వ్యవహరించడం లేదని అన్నారు. రోజు నోరు తెరిస్తే బారు, బీరు అనే పదాలే వస్తున్నాయని... వాటి మీద ఉన్న ప్రేమను నాలుగు గోడల మధ్యే ఆమె చూసుకోవాలని హితవు పలికారు. రోజా నోటిని అదుపులో పెట్టుకోవాలని, లేకపోతే బుద్ధి చెబుతామని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News