: హైదరాబాదులో డ్రగ్స్ మత్తులో జోగుతున్న స్కూళ్లు ఇవే.. మీ పిల్లలు ఇక్కడ చదువుతుంటే జాగ్రత్త పడండి!
హైదరాబాదులోని పలు స్కూళ్లు, ఇంజనీరింగ్ కాలేజీలు డ్రగ్స్ భూతం విసురుతున్న పంజాలో చిక్కుకున్నాయి. చిన్న వయసులోనే డ్రగ్స్ కు అలవాటు పడుతూ, జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు విద్యార్థులు. ఖరీదైన స్కూళ్లలో డ్రగ్స్ విచ్చలవిడిగా దొరుకుతున్నాయి. వెయ్యికి పైగా విద్యార్థులకు డగ్స్ అందుతున్నాయనే విషయం విచారణలో వెలుగు చూడటం షాక్ కు గురి చేస్తోంది. ఇప్పటికే ఆయా విద్యా సంస్థల యాజమాన్యాలకు నోటీసులు జారీ అయ్యాయి. అయినా, సదరు విద్యా సంస్థల యాజమాన్యాల నుంచి మిశ్రమ స్పందన మాత్రమే వస్తోందని తెలుస్తోంది. కేంద్రీయ విద్యాలయాల్లో కూడా డ్రగ్స్ లభిస్తుండటం గమనార్హం. ఏయే స్కూలు విద్యార్థులకు డ్రగ్స్ సరఫరా అయ్యాయనే విషయం సిట్ విచారణలో వెల్లడైంది.
డ్రగ్స్ సప్లై అవుతున్న స్కూళ్లు ఇవే...
జూబ్లీ పబ్లిక్ స్కూల్, ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్, ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్, చిరాక్ ఇంటర్నేషల్ స్కూల్, అగాఖాన్ స్కూల్, రాక్ వెల్ ఇంటర్నేషనల్ స్కూల్, గ్లెండెల్ స్కూల్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్, భారతీయ విద్యాభవన్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, నాజర్ స్కూల్, సంఘమిత్ర పబ్లిక్ స్కూల్, శ్రీనిధి ఇంటర్నేషనల్ స్కూల్, సిల్వర్ ఓక్స్ స్కూల్, కేంద్రీయ విద్యాలయ, అక్షర ఇంటర్నేషనల్ స్కూల్, గీతాంజలి పబ్లిక్ స్కూల్, జాన్సన్ గ్రామర్ స్కూల్, డీఏవీ పబ్లిక్ స్కూల్.