: తాడిపత్రి యువ‌తి లక్ష్మీ ప్రసన్నకు రూ.20 ల‌క్ష‌ల సాయం ప్ర‌క‌టించిన చంద్ర‌బాబు


అనంతపురం జిల్లా తాడిపత్రిలోని కృష్ణాపురంలో రామసుబ్బారెడ్డి అనే వ్య‌క్తి మొన్న రాత్రి త‌న‌ భార్య సులోచన, కుమార్తెలు ప్రత్యూష, ప్రతిభలను దారుణంగా చంపేసిన విష‌యం తెలిసిందే. ఈ రోజు ఉద‌యం రామసుబ్బారెడ్డి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. తిరుపతిలో చదువుకుంటున్న రామసుబ్బారెడ్డి, సులోచన దంపతుల పెద్ద కూతురు లక్ష్మీ ప్రసన్న ఈ రోజు ఇంటికి వ‌చ్చింది. ఈ రోజు అనంత‌పురంలోనే ప‌ర్య‌టిస్తోన్న ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడిని ఆ యువ‌తి మహిళ కమిషన్ ఛైర్మన్ నన్నపనేని రాజకుమారి సాయంతో క‌లిసింది.

ఈ సందర్భంగా ఆమెకు చంద్ర‌బాబు నాయుడు రూ.20 ల‌క్ష‌ల ఆర్థిక సాయాన్ని ప్ర‌క‌టించారు. ఆ యువ‌తికి త‌ల్లిదండ్రులు లేని లోటును తాను తీరుస్తానని చెప్పారు. ఆమె చ‌దువుకి అయ్యే ఖ‌ర్చును కూడా భ‌రిస్తామని చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ సంద‌ర్భంగా ప్రసన్న మాట్లాడుతూ... తాను బాగా చ‌దువుకుని తన తల్లి తనను ఎలా చూడాలనుకుందో అలా అవుతాన‌ని చెప్పింది. త‌న తండ్రిలాంటి దుర్మార్గులు ఎక్క‌డా ఉండ‌కూడ‌ద‌ని పేర్కొంది. త‌న తల్లిని, చెల్లెల్ని త‌న తండ్రి దారుణంగా చంపేశాడ‌ని క‌న్నీరు పెట్టుకుంది.  

  • Loading...

More Telugu News