: కారు ప్రమాదంలో లాలూ తలకు గాయాలు
ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ప్రమాదంలో గాయపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న కారు ముందున్న అద్దం ఒక్కసారిగా పగిలిపోవడంతో లాలూ తలకు, ముఖానికి గాయాలయ్యాయి. వైద్య సహాయం కోసం వెంటనే ఆయనను పాట్నాకు తరలించారు. మే 15న పార్టీ తరఫున నిర్వహించనున్న పరివర్తన్ ర్యాలీ పనుల్లో బిజీగా ఉన్న ఆయన కుటుంబ సభ్యులను కలవడం కోసం రాగోపూర్ కు వెళుతుండగా శుక్రవారం ఈ ప్రమాదం బారిన పడ్డారు.