: ఫినాయిల్ తో కడిగినా ఆ గబ్బు పోదు: రోజాపై ఎమ్మెల్యే బండారు తీవ్ర వ్యాఖ్యలు
వైపీపీ ఎమ్మెల్యే రోజాపై టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రోజాది బోరో లేక నోరో తెలియడం లేదని వ్యాఖ్యానించారు. ఫినాయిల్ తో కడిగినా ఆ గబ్బు పోదని ఘాటుగా విమర్శించారు. ఏదైనా మాట్లాడే ముందు వాస్తవాలు గ్రహించాలన్న ఇంగిత జ్ఞానం కూడా రోజాకు లేదని మండిపడ్డారు. నకిలీ హెరిటేజ్ వ్యానులో ఎర్ర చందనం దుంగలు దొరికితే... చంద్రబాబు కుటుంబ సభ్యులే స్మగ్లింగ్ చేస్తున్నట్టు ఆరోపిస్తారా? అంటూ ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రిపై, ప్రభుత్వంపై ప్రతి రోజు విమర్శలు గుప్పించడమే రోజా పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఆమె నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు.