: ప్రస్తుత ప్రపంచ రాజకీయాల్లో మోదీ ఓ గొప్ప నాయకుడు: ఇజ్రాయెల్ అధ్యక్షుడు రివ్లిన్
తన మూడు రోజుల ఇజ్రాయెల్ పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్రమోదీ, ఆ దేశ అధ్యక్షుడు రూవెన్ రివ్లిన్‌ను కలిశారు. దేశ అధ్యక్ష నియమాలను పక్కన పెట్టి, ఇతర దేశం నుంచి వచ్చిన అతిథిని రివ్లిన్ సాదరంగా ఆహ్వానించారని మోదీ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ప్రస్తుత గొప్ప రాజకీయ నాయకుల్లో మోదీ ఒకరని రివ్లిన్ కొనియాడారు. గత ఏడాది నవంబర్‌లో భారత్‌కు వచ్చినపుడు రివ్లిన్ ప్రదర్శించిన దార్శనికత, చూపించిన మర్యాద ఆయనపై గౌరవాన్ని పెంచినట్లు ప్రధాని మోదీ ఇజ్రాయెల్ అధ్యక్ష భవనంలోని అతిథి పుస్తకంలో రాశారు. అధ్యక్షుడు రివ్లిన్ కూడా తన పర్యటనను గుర్తుచేసుకుని బలమైన ఆశయాలు, దృక్పథాలు ఉన్న దేశంగా భారత్‌ను కొనియాడారు. రివ్లిన్ ఆహ్వానానికి, అతిథి సత్కారానికి ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు.