: ఎన్టీఆర్ సినిమాకు వర్మ దర్శకత్వంపై నారా లోకేష్ స్పందన
దివంగత ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా సినిమాను తెరకెక్కిస్తున్నట్టు ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ జీవితానికి సంబంధించి, ఎవరికీ తెలియని అంశాలు ఈ సినిమాలో ఉంటాయని వర్మ తెలిపాడు. ఎన్టీఆర్ నాశనాన్ని ఎవరు కోరుకున్నారు, ఆయన వెనక జరిగిన కుట్రల వెనకున్న అసలైన కుట్ర ఏంటనే విషయాన్ని తెరపై చూపిస్తానని చెప్పాడు.
ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ సినిమాపై ఆయన మనవడు, మంత్రి నారా లోకేష్ స్పందించారు. ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా సినిమా తీయాలనే విషయాన్ని పోర్చుగల్ కు వెళ్లినప్పుడు తాము అనుకున్నామని చెప్పారు. ఎన్టీఆర్ పాత్రకు బాలయ్య అయితేనే సరిపోతారని తెలిపారు. దర్శకుడు ఎవరైనా సరే బాలయ్య ఉంటే సినిమా హిట్ అవుతుందని అన్నారు. ఈ సినిమాకు దర్శకుడిగా రామ్ గోపాల్ వర్మను ఇంకా అనుకోలేదని చెప్పారు.